KCR: కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఏమన్నారంటే..?
ABN , Publish Date - Mar 22 , 2024 | 07:55 PM
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwa) అరెస్టును బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుని అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwa) అరెస్టును బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుని అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘటనలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఖరిని రుజువు చేస్తున్నాయని తెలిపారు.
ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని చెప్పారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి