Home » Kesineni Chinni
తాను ఎప్పుడూ అందరి మనిషినని.. ప్రజల మనిషినని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) తెలిపారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. సీఎం చంద్రబాబుకు తాను మొదటి నుంచీ అభిమానినని.. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం తనకు వచ్చిందని కేశినేని చిన్ని తెలిపారు.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని టీడీపీ నాయకులు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, చెన్నుపాటి శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవులు వస్తాయి.. పోతాయి.. కానీ కమిట్మెంట్ చాలా ముఖ్యమని.. అటువంటి కమిట్మెంట్ ఉన్న నేత కేశినేని శివనాథ్ అని పేర్కొన్నారు.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్‌కు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనలు తెలిపారు. వైసీపీ ఆరాచక పాలనపై చేసిన న్యాయపోరాటంలో దమ్మాలపాటి కీలకపాత్ర పోషించారన్నారు. న్యాయశాస్త్రంపై మంచి పట్టువన్న న్యాయవాది ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ అని పేర్కొన్నారు.
విజయవాడ: మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఫైర్ అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బెజవాడ మొత్తం పోలీసుల అష్టదిగ్బంధనంలో ఉంది. వారధి, ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి విజయవాడలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. వారధి వద్ద గుంటూరు వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదే విధంగా గుంటూరులోనే జాతీయ రహదారి పైకి వాహనాలను అనుమతించడం లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సునామీల దూసుకెళ్లింది. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి.. మిగిలిన స్థానాలన్నింటినీ కూటమి తన ఖాతాలో వేసుకుంది. చంద్రబాబు నివాసం వద్ద భద్రతను అధికారులు మరింత పెంచారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకంగా కావడంతో నేషనల్ మీడియా సైతం చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఎక్కువగా కూటమికే అవకాశాలు ఉన్నాయని.. పెద్ద ఎత్తున పోలింగ్ జరగడమే దీనికి సంకేతమని టీడీపీ నేతలు అంటున్నారు. విజయవాడ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూటమి కైవనం చేసుకుంటుందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని నేడు తెలిపారు.
Telangana: మైలవరం వీవీఆర్ జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని ) సందర్శించారు. ఈవీఎం మొరాయింపుపై ఏఆర్ఓ రాజేశ్వరరావుపై కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని ఆరోపించారు. మైలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలు మొరాయించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది.