Babu Jagjivan Ram: బాబూ జగ్జీవన్ రామ్‌కు ప్రముఖుల ఘన నివాళి
ABN , Publish Date - Apr 05 , 2025 | 10:22 AM
Babu Jagjivan Ram: భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్ పోరాటం చేశారని నేతలు కొనియాడారు.

భారతదేశానికి బాబూ జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చాలా గొప్పవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని తెలిపారు. వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు.
సమసమాజ స్థాపన కోసం కృషిచేశారు: సీఎం చంద్రబాబు
భారత మాజీ ఉప రాష్ట్రపతి డా. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలోనూ... స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ మేరకు సోషల్ మాధ్యమంలో సీఎం చంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. తన జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన బాబూ జగ్జీవన్ రామ్ స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ ఆశించిన సమాజాన్ని నిర్మిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు.
దళితుల అభ్యున్నతి కోసం పోరాడారు: మంత్రి నారా లోకేష్
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానవని అభివర్ణించారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషిచేశారని ఉద్ఘాటించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దామని నారా లోకేష్ పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన దార్శనికుడు బాబూ జగ్జీవన్ రామ్: ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ: బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఘన నివాళులర్పించారు. విజయవాడ శిఖామణి సెంటర్‌లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. సామాజిక సమానత్వం కోసం,వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన దార్శనికుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా వెనుకబడిన వర్గాలు ఉన్నత స్థానంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీ4 అని విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఉద్ఘాటించారు. పీ4 కార్యక్రమం ద్వారా 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలకు, ధనికులుగా ఉన్న 10 శాతం మంది విద్యా, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల అందించడమే పీ4 లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Axis Power Deal: జగన్ బాటలోనే చంద్రబాబు
YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ
Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్
For More AP News and Telugu News