Share News

MP Sivanath: లోక్‌సభలో రైల్వే సమస్యలపై కీలక చర్చ .. ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఏమన్నారంటే

ABN , Publish Date - Mar 17 , 2025 | 05:23 PM

MP Kesineni Sivanath: అమ‌రావ‌తి రాజధానిని ప్రధాన నగరాలు, ఓడరేవులతో అనుసంధానిచడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో అమరావతి రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. గత మూడేళ్లుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకెళ్లారు.

MP  Sivanath: లోక్‌సభలో రైల్వే సమస్యలపై  కీలక  చర్చ .. ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఏమన్నారంటే
MP Kesineni Sivanath

ఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు 2019-20లో రూ.68,000 కోట్ల నుంచి 2025-26 నాటికి రూ.2 లక్షల కోట్లకు పెరిగిందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తెలిపారు. ఇవాళ(సోమవారం) లోక్‌స‌భ‌లో రైల్వేపై డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై (DFG) చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి రైల్వే లైన్‌ను ఆమోదించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ రైల్వే బ‌డ్జెట్ దేశా రైల్వే భవిష్యత్తుకు అనుకూలంగా మార్చాలనే ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధత ప్రతిబింబిస్తోందని అన్నారు. విజయవాడ సమీపంలోని పరిటాలలో మల్టీ-మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతించారు. అమ‌రావ‌తి రాజధానిని ప్రధాన నగరాలు, ఓడరేవులతో అనుసంధానిచడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో అమరావతి రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కోచ్ ఉత్పత్తి లక్ష్యం 2023-24 నుంచి 2024-25 వరకు 11శాతం పెరిగిందని, దేశీయ తయారీలో పురోగతిని పరిగణనలోకి తీసుకుంటూ కోచ్‌లను ఎగుమతి చేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం అన్వేషించాలని ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ్ఞప్తి చేశారు.


గత మూడేళ్లుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద స్టేషన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకెళ్లారు. విజ‌యవాడ గుణదల-బెజవాడ క్రాసింగ్ వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో జాయింట్ సర్వే పూర్తి కాగా, ఈ ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ఎంపీ శివనాథ్ ప్ర‌స్తావించారు. అజిత్‌సింగ్‌ నగర్‌లో ఆర్‌ఓబీ లేకపోవడంతో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు వివ‌రించి, కేంద్ర‌ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జోక్యం చేసుకుని పరిష్కరించాలని ఎంపీ శివనాథ్ కోరారు. కేంద్ర‌ప్ర‌భుత్వం రైల్వే వేగవంతమైన, మెరుగైన సమర్థత, స్థిరత్వాన్ని నిర్ధారించడంపై దృష్టి కేంద్రీకరించడం శుభ పరిణామమని అన్నారు. రైల్వే రూట్లలో 97శాతం విద్యుద్దీకరణలో సుస్థిరత పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునికీకరణ కోసం 1,337 స్టేషన్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. 136 వందే భారత్ రైళ్ల ఏర్పాటుతో సుదూర ప్రాంతాలకు వేగవంతమైన అనుసంధానం గణనీయంగా మెరుగుపడిందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TTD decision: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇకపై

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవినీతిపై అచ్చెన్న సమాధానం ఇదీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 05:24 PM