Home » Kesineni Swetha
Andhrapradesh: విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామాకు ఆమోదం లభించింది. మంగళవారం శ్వేత రాజీనామాను మేయర్ భాగ్యలక్ష్మి ఆమోదించారు. ఇటీవల కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.. వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఎంపీగా రాజీనామా చేశానని, ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతానని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్‌లో ఉంది. ఎందుకంటే..
తెలుగుదేశం పార్టీకి (TDP) రాజీనామా చేస్తానంటూ సోమవారం ఉదయం ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత ‘ఎక్స్’ వేదికగా తొలిసారి స్పందించారు. ‘‘ టీడీపీతో నా ప్రయాణం ముగిసిందని బరువెక్కిన హృదయంతో తెలియజేస్తున్నాను. నాకు మార్గనిర్దేశనం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సార్‌కి, లోకేశ్ అన్నకి ధన్యవాదాలు’’ అని అన్నారు.
Andhrapradesh: కార్పొరేటర్ పదవికి రాజీనామా అనంతరం కేశినేని శ్వేత మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 11వ డివిజన్ కార్పొరేటర్‌గా రాజీనామా చేశానని.. తన రాజీనామా ఆమోదం పొందాక టీడీపీ పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తాము ఎప్పుడూ టీడీపీని వీడాలని అనుకోలేదన్నారు.
Andhrapradesh: కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. సోమవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు శ్వేత పేర్కొన్నారు.