Share News

AP Politics : టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ..!?

ABN , Publish Date - Jan 10 , 2024 | 02:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్‌లో ఉంది. ఎందుకంటే..

AP Politics : టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ..!?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయ్. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పు తర్వాత పరిణామాలతో వైసీపీ (YSRCP) ఢీలా పడగా.. తెలుగుదేశం (Telugudesam) మాత్రం యమా జోష్‌లో ఉంది. ఎందుకంటే.. వైసీపీలో సీట్లు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు పసుపు కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరీ ముఖ్యంగా బెజవాడ రాజకీయాలు ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి. వారం రోజులుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని (MP Kesineni Nani), వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) ఎపిసోడ్‌లు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


YSRCP.jpg

ఇంతకీ ఎవరా ఎంపీ..?

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎంపీ కేశినేని నాని.. తన కుమార్తె కేశినేని శ్వేతతో (Kesineni Swetha) కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారట. ఇవాళ సాయంత్రం (బుధవారం) సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (CM YS Jagan Reddy) భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. అంతకుముందే కేశినేని కూడా టీడీపీకి రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. మొదట వారం, పదిరోజుల్లో టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ ఇక ఆలస్యం చేయకుండా జగన్‌తో భేటీ కావాలని నాని భావించారట. వైసీపీ కండువా కప్పుకున్నాక విజయవాడ పార్లమెంటు స్థానం నుంచే కేశినేనిని వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. నాని పోటీచేయని పక్షంలో శ్వేతకు ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తామని వైసీపీ హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినవస్తున్నాయి. జగన్‌తో భేటీ తర్వాత టికెట్ విషయంపై సస్పెన్స్ వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. 2024 ఎన్నికల్లో తాను పోటీచేయనని టీడీపీ అధినేత చంద్రబాబుకు పలుమార్లు కేశినేని చెప్పారు. నాటి నుంచే నాని.. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో కలివిడిగా ఉంటున్నారు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే మాత్రం హైకమాండ్‌పై అలకబూనడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎగ్గొట్టడం లాంటివి చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎంపీ నియోజకవర్గ నిధులు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సూచించిన వారికే ఇవ్వడం గమనార్హం. దీనిపై టీడీపీ శ్రేణులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా ‘ప్రొటోకాల్‌’ పేరుతో నాని తన విధానాన్ని సమర్థించుకునేవారు. ఇంత చేసినా క్యాడర్ మాత్రం కేశినేనితో ఉన్నా.. చివరాకరికి నాని పార్టీని వీడటానికి సిద్ధం కావడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.


Kesineni Swetha.jpeg

ఎమ్మెల్యే ఈయనే..?

పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వట్లేదని.. మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీచేయాలని వైసీపీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. అయితే.. తాను ఎమ్మెల్యేగా, అది కూడా పెనమలూరు నుంచి మాత్రమే పోటీచేస్తానని హైకమాండ్‌కు తెగేసి చెప్పేశారు. ఈ క్రమంలో ఒకరిద్దరు కీలకనేతలను రంగంలోకి దింపి పార్థసారథితో మంతనాలు జరిపింది. మూడు దఫాలుగా జరిపిన చర్చలు కూడా ఫలించలేదు. అయితే.. ఆయన మాత్రం తగ్గేదేలా.. టికెట్ ఇస్తే సరే లేకుంటే వైసీపీలో కొనసాగలేనని.. టీడీపీలో చేరతానని చెప్పేశారట. ఈ ఎపిసోడ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్థసారథి టచ్‌లోకి వెళ్లారట. పెనమలూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికే టీడీపీ అధిష్టానం ఫిక్స్ అయ్యిందట. వీలుకాని పక్షంలో నూజివీడు టికెట్ అయినా సరే ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందట. మరోవైపు.. టీడీపీ నేతలు వెలగపూడి రామకృష్ణ, బొమ్మసాని సుబ్బారావు.. సారథితో ఇప్పటికే చర్చలు జరిపారు. టీడీపీలో చేరడానికి ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 18న కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే చంద్రబాబు ‘రా.. కదలి రా’ బహిరంగ సభ కార్యక్రమంలో పార్థసారథి పసుపు కండువా కప్పుకుంటారట. ఇలా ఒకరిద్దరే కాదు.. మరో సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు.. నెల్లూరు నుంచి బడా నేత.. టీడీపీలోకి టచ్‌లోకి వెళ్లారట. మున్ముందు ఇంకా ఎంత మంది నేతలు జంపింగ్‌లు అవుతారో చూడాలి మరి.

Kolusu Partha Sarathy.jpeg

Updated Date - Jan 10 , 2024 | 02:36 PM