Kesineni Swetha: ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత రాజీనామా ఆమోదం
ABN , Publish Date - Jan 30 , 2024 | 12:26 PM
Andhrapradesh: విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామాకు ఆమోదం లభించింది. మంగళవారం శ్వేత రాజీనామాను మేయర్ భాగ్యలక్ష్మి ఆమోదించారు. ఇటీవల కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ, జనవరి 30: విజయవాడ ఎంపీ కేశినేని నాని (Vijayawada MP Kesineni Nani) కుమార్తె కేశినేని శ్వేత (Kesineni Swetha) రాజీనామాకు ఆమోదం లభించింది. మంగళవారం శ్వేత రాజీనామాను మేయర్ భాగ్యలక్ష్మి (Mayor Bhagyalaxmi) ఆమోదించారు. ఇటీవల కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈనెల 8న విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత.. మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు. దీంతో రెండు వారాల తర్వాత కేశినేని శ్వేత రాజీనామాను ఆమోదిస్తూ మేయర్ భాగ్యలక్ష్మి నిర్ణయం తీసుకున్నారు.
కాగా.. విజయవాడ ఎంపీ కేశినేని టీడీపీ గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీతో తన ప్రయాణం ముగిసిందని ప్రకటించిన కేశినేని ఆ వెంటనే సీఎం జగన్‌ను కలవడం వెనువెంటనే వైసీపీలో చేరడం జరిగిపోయాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...