Home » Khammam News
ఖమ్మం జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఓడి పోయామని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Pocharam Srinivasa Reddy ) అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం నాడు ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రజల అందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ( Minister Ponguleti Srinivas Reddy ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో పొంగులేటి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ..... ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి మంత్రులు మీ సేవకులుగా పనిచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
తాను ఏ పార్టీలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ( NTR ) సంక్షేమ రాజ్యం ఆశయం కోసం పనిచేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా టీడీపీ నేతల ఆహ్వానం మేరకు సోమవారం నాడు తుమ్మల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి తుమ్మల వెళ్లారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
జిల్లాలోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆర్టీఓ కార్యాలయం వెనుక నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు రామాలయం సమీపంలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆక్రమించిన ప్రభుత్వ భూమిలోని షెడ్లను అధికారులు కూల్చివేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) సింగరేణి గనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) స్పష్టం చేశారు. సోమవారం నాడు మణుగూరు సింగరేణి ఓసి 2 వద్ద ఏర్పాటు చేసిన ఫిట్ మీటింగ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ... సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ( INTUC ) గడియారం గుర్తుపై ఓటే వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
6 గ్యారెంటీలను వందరోజుల్లోగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. సోమవారం నాడు ఖమ్మంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియాగాంధీ ఆశీస్సులతో సుపరిపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీపి వార్త వింటారని రెవెన్యూశాఖ & గృహనిర్మాణ, సమాచారా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Minister Ponguleti Srinivasa Reddy ) తెలిపారు. శనివారం నాడు ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలోని పాలేరులో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు, దుస్తులు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా పీఆర్వోగా మండల పరిధిలోని కొత్తకమలాపురానికి చెందిన దుద్దిపాళ్ల విజయకుమార్
మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహించే పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మి) వార్సికోత్సవాలకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ
భద్రాచలంలో రాముడు కొలువై ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం నాడు భద్రాద్రి రామాలయాన్ని భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రులకు ఆలయ మర్యాదలతో ఈవో రమాదేవి స్వాగతం పలికారు.