Pocharam Srinivasa Reddy: నేతల మధ్య విభేదాలతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయం
ABN , Publish Date - Jan 09 , 2024 | 02:21 PM
ఖమ్మం జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఓడి పోయామని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Pocharam Srinivasa Reddy ) అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నాడు ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో నేతల మధ్య విభేదాలు ఎక్కువ అయ్యాయని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఓడి పోయామని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Pocharam Srinivasa Reddy ) అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నాడు ఖమ్మం పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి నేతల మధ్య వర్గ విభేదాలు పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. లేకపోతే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...