Home » Khammam News
ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిన్న కురిసిన భారీ వర్షాలకు గ్రామం సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ రావి చెట్టు పడింది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్లు చూస్తే అబద్ధాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) విమర్శించారు. ఎంఎండీఆర్ పేరుతో చట్టం ఏర్పాటు చేసి ఆ గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తున్నారన్నారు.
ఉన్నత విద్యనభ్యసించేందుకు తన వారందరినీ వదిలి అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లా యువకుడు ప్రమాదవశాత్తు స్విమ్మింగ్పూల్లో మునిగి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన శ్రీనాధరాజు కిరణ్ (20) హెదరాబాద్లో గత ఏడాది ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
ప్రాణపాయంలో ఉన్న యువకుడికి గ్రామీణ వైద్యుడు రాంబాబు సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన బల్లేపల్లిలో జరిగింది. వైద్యుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది. దీంతో వైద్యుడికి స్థానికులు అభినందనలు తెలిపారు.
వైరా (Wyra) మండలం పాలడుగు సమీపంలో కారు అదుపుతప్పి (Car Accident) చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి వాసులుగా గుర్తించారు.
సత్తుపల్లి(Sathupally) మండలం కిష్టారం(Kishtaram) ఓసీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ(Lorry) ఢీకొట్టడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(52), కుమారుడు అశోక్(30)గా గుర్తించారు.
మణుగూరు(Manuguru)లో భారీగా గంజాయి(Ganja) పట్టుపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డొంకరాయి (Donkarayi) నుంచి మణుగూరు మీదుగా మామిడికాయల మాటున ట్రాలీలో హైదరాబాద్కు తరలిస్తుండగా 477కేజీలను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1.19కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో తాగునీటి విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థలు ఆందోళనకు దిగారు.
రఘునాథపాలెం మండలం హర్యాతండాలో నిన్న జరిగిన కారు ప్రమాద ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఖమ్మం జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు రహదారి పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబంలోని భార్య, ఇద్దరు చిన్నారులు మరణించగా, కారు నడిపిన భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.