TG News: ఖమ్మంలో భారీ వర్షాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

ABN, Publish Date - Jun 30 , 2024 | 04:17 PM

ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిన్న కురిసిన భారీ వర్షాలకు గ్రామం సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ రావి చెట్టు పడింది.

ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిన్న కురిసిన భారీ వర్షాలకు గ్రామం సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ రావి చెట్టు పడింది. అయితే రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో రోడ్డుపై ఉన్న చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి

Updated at - Jun 30 , 2024 | 04:17 PM