Home » Khammam
కాంగ్రెస్(Congress) సర్కార్ చేసిన రూ.2 లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు. రుణమాఫీ జరగలేదని రోడ్లపై ముళ్ల కంచెలు వేసి నిరసనకు దిగారు.
‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తారు. ముల్కలపల్లి మండలం, పూసుగూడెం వద్ద ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరణ చేసి పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేస్తారు. అనంతరం డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 3 పంప్‌హౌ్‌సలను ప్రారంభించనున్నారు.
Telangana: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్‌ను రేపు (ఆగస్టు 15) ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు.
Telangana: ఖమ్మం జిల్లా రఘునాథ పాలెంలో సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తత పేరుతో హై డ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహకారంతో హైదారాబాద్‌వాసికి దాదాపు రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టేసింది.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన సీతారామ ప్రాజెక్టుకు.. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలతో తుమ్మల మనస్తాపానికి గురయ్యారు.
కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Telangana: ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనే సీతారామ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వం 8 వేల కోట్లతో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా సద్వినియోగం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.