Home » Kishan Reddy G
గత ఐదేళ్లలో బీజేపీ పాలనలో జరిగిన జమ్మూ కశ్మీర్ అభివృద్ధి కాంగ్రెస్ కనిపించడం లేదా అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, జమ్మూ కశ్మీర్ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే అని పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సీరియ్సగా తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై స్థానిక నాయకత్వం తక్షణం స్పందించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో తమ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santosh) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు బీజేపీ కార్యాలయానికి బీఎల్ సంతోష్ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ అగ్రనేత సమావేశమయ్యారు.
గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఎస్సీ వర్గీకరణ గురించి ప్రకటన చేశారని గుర్తు చేశారు.
ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు? రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని? మొదటి, రెండో దశల్లో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు దశలవారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తోందని ఆరోపించారు.
సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనేదీ కేంద్రప్రభుత్వానికి లేదని పార్లమెంటు వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. 24 జూలై నాడు పార్లమెంటు వేదికగా ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మౌఖికంగా సమాధానం ఇచ్చారు.
పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రైతు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు రైతు సమస్యలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని విమర్శించారు.