Share News

Kishan Reddy : గనుల తవ్వకాల ప్రాంతాల్లో జల సంరక్షణపై దృష్టి పెట్టండి

ABN , Publish Date - Aug 02 , 2024 | 04:12 AM

గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.

Kishan Reddy : గనుల తవ్వకాల ప్రాంతాల్లో జల సంరక్షణపై దృష్టి పెట్టండి

  • కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

  • పది కీలక బొగ్గు గనులకు అనుమతులు

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): గనుల తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో జల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో బొగ్గు, లిగ్నైట్‌ గనుల వద్ద జలవనరుల గుర్తింపు, పర్యావరణానికి అనుకూలం గా గనుల నిర్వహణపై సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా గనుల ప్రభు త్వ రంగ సంస్థ (పీఎ్‌సయూ)ల కోసం మార్గదర్శకాలను విడుదల చేసి ఆయన మాట్లాడారు. గనుల నుంచి వచ్చే నీటి సద్వినియోగం ద్వారా సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే వీలుంటుందని తెలిపారు.

కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌ చంద్ర దూబే, ఆ శాఖ కార్యదర్శి అమృత్‌లాల్‌ మీనా పాల్గొన్నారు. అనంతరం బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో పది కీలక బొగ్గు గనులకు అనుమతి పత్రాలను కిషన్‌రెడ్డి అందజేశారు.

ఈ గనుల్లో 2,395 మిలియన్‌ టన్నుల నిల్వలున్నాయని.. వీటి ద్వారా ఏడాదికి రూ.166.36కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందన్నారు. తొలుత కిషన్‌రెడ్డిని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ ఫిలిప్‌ గ్రీన్‌ కలిశారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య బొగ్గు, ఖనిజాలకు సంబంధించి జరిగిన ఒప్పందాలు, పరస్పర సహకారం తదితర అంశాలపై వీరు చర్చించారు.

Updated Date - Aug 02 , 2024 | 04:12 AM