వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం:కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Aug 02 , 2024 | 03:45 AM
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఎస్సీ వర్గీకరణ గురించి ప్రకటన చేశారని గుర్తు చేశారు.
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఎస్సీ వర్గీకరణ గురించి ప్రకటన చేశారని గుర్తు చేశారు.
సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఢిల్లీలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు చాలా సంతోషకరమని అన్నారు. సుప్రీం తీర్పును అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనదని తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పును తమ ప్రభుత్వం వెంటనే అమలు చేస్తుందని అన్నారు.
వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఒక వర్గం సాగించిన నిరంతర పోరాటానికి దక్కిన ఫలితమని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విజ్ఞప్తి చేశారు. వర్గీకరణపై దశాబ్దాలుగా నెలకొన్న వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించడం శుభపరిణామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.