Home » Kishan Reddy G
అంబర్‌పేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టలేదని విమర్శలు చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలకు ప్రజలు ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి(Union Minister G. Kishan Reddy) అన్నారు.
బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్లబంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు. మోదీ నాయకత్వంలో తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు.
కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు రెండు కీలక పదవులు దక్కాయి. కేంద్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే బొగ్గు, గనుల శాఖను కిషన్‌రెడ్డికి కేటాయిస్తూ ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించే హోంశాఖకు సహాయ మంత్రిగా బండి సంజయ్‌ని నియమించారు.
రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకొచ్చే శాఖలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో బొగ్గు పాత్ర కీలకమని, నల్లబంగారం వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై ఆ శాఖ మంత్రిగా తాను పనిచేయాల్సి ఉంటుందన్నారు.
మోదీ 3.0 కేబినేట్‌లోతెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ, కిషన్‌రెడ్డికి (Kishan Reddy) కేంద్రమంత్రి అవకాశం కల్పించారు. నిన్న(ఆదివారం) రాష్ట్రపతి భవన్లో కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: మోదీ కేబినెట్లో మరోసారి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
బీజేపీలో సంస్థాగత మార్పులు త్వరలో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా కొనసాగించారన్నారు. ఇప్పుడు ఆ పదవీకాలం పూర్తయిందన్నారు. అధ్యక్ష మార్పు అనివార్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తనకు మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించారని కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రధానిగా చేసిన రికార్డ్ కేవలం జవహర్లాల్ నెహ్రూదే. ఇప్పుడు మోదీ ఆ రికార్డును సమం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.