Home » kishan reddy
పదో విడత బొగ్గు గనుల వేలం ఈ నెల 21న హైదరాబాద్‌లో జరుగనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకులను వేలం వేయనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ వేలాన్ని ప్రారంభించనున్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ వేదికగా పద్మవిభూషణ్ సంధించిన పలు ప్రశ్నలకు.. కిషన్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇంటర్వ్యూకు ముందు.. ‘‘ నా చిరకాల మిత్రుడు, శ్రేయోభిలాషి, తెలుగుజాతి గర్వపడే మెగాస్టార్ చిరంజీవి గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని అందుకుంటున్న తరుణంలో వారిని కలిసి అభినందించిన సందర్భంలో జరిగిన ఆత్మీయ భేటి’ అంటూ ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఇంటర్వ్యూను ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’లో లైవ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా చూడగలరు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుకుని ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలనే కసితో ఉన్న బీజేపీ దళం అందుకు తగినట్లు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఓ వైపు ఎంపీ అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేయడం, మరోవైపు ప్రచారంలో దూసుకుపోయే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) ఓ సూటి ప్రశ్న సంధించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్‌ను ఖండించిన కేసీఆర్.. కూతురు కవిత అరెస్ట్‌పై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ మౌనానికి గల కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ(BJP) దూకుడు పెంచింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది. కార్యచరణలో భాగంగా శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది.
ఏప్రిల్ మొదటివారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. ఆదివారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర తూప్రాన్ చేరుకుంది. ఈ యాత్రలో కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్న నష్టం లేదని చెప్పారు.
Telangana: వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినవని.. మోదీతోనే దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకులే వద్దంటున్నారన్నారు.
బుధవారం ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో గోల్కొండలో లైట్ అండ్ ఇల్యూమినేషన్ షోని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి & సినీ నటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.
రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందన్నారు. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు.
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.