Rakhi Festival: మానవాతా దృక్పథాన్ని చాటుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి
ABN , Publish Date - Aug 19 , 2024 | 04:16 PM
Telangana: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి తిరుమలగిరిలోని మిలిటరీ హాస్పిటల్ లో రక్షాబధన్ వేడుకలు జరుపుకున్నారు. దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నడుమ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 19: దేశ వ్యాప్తంగా రాఖీ వేడుకలు (Rakhi Festival) ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కడుతూ వేడుకను ఆనందగా జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ (PM Modi) సహా రాజకీయ నేతలు రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాలుపంచుకున్నారు. విద్యార్థుల సమక్షంలో ప్రధాని రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఇదిలా ఉండగా... రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) సతీమణి కావ్య రెడ్డి తిరుమలగిరిలోని మిలిటరీ హాస్పిటల్‌లో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు.
KTR: మంత్రి సీతక్కకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నడుమ రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సైనికులకు, రోగులకు కావ్యారెడ్డి రాఖీలు కట్టి స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి రక్షగా సైనికులు మనకు తోడుగా నిలిచారని, రోగులకు రక్షణగా ఆసుపత్రి వైద్యులు నిలిచారని అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి రక్షాబంధన్ సందర్భంగా మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
Vishnukumar Raju: జగన్‌పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ నివాసం వద్ద...
కాగా.. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద రాఖీ సందడి నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy)మహిళా మంత్రులు, ఎంపీలు, మహిళా నేతలు రాఖీలు కట్టి వారి ఆనందాన్ని తెలియజేశారు. మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, రాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నెరేళ్ల శారద, కాల్వ సుజాత, తదితరులు సీఎంకు రాఖీ కట్టారు. అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. రాఖీ కట్టే సమయంలో ముఖ్యమంత్రి సతీమణి, కుమార్తె, మనవడు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలా నేతలు రాఖీ కట్టడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Rakhi Festival: సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మహిళానేతలుCM
Revanth: బాలికకు అండగా నిలిచిన సీఎం రేవంత్.. ఇదీ కథ.!!
Read Latest Telangana News And Telugu News