Home » Kodi Kathi
కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
విశాఖపట్నం: కోడి కత్తి కేసుకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్ తరుపు న్యాయవాది అబ్దుల్ సలీం కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పితే వేరొకరు ఎవరు ఐ విట్నెస్‌గా లేరని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Varla Ramaiah)కి కోడికత్తి శ్రీనివాస్(Kodikatti Srinivas) విషయంలో జాలి, దయ కరుణ ఉంటే మాట్లాడాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.
అమరావతి: కోడికత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్ తరపు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు చెబుతున్నవన్నీ అబద్దాలేనని.. అవే అబద్దాలను సాక్షి పత్రికలో ప్రచురించారని కోడికత్తి శ్రీను తరపు న్యాయవాది అబ్దుల్ సలీం అన్నారు.
నసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, న్యాయవాది రజనీకి కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను సోదరుడు సుబ్బరాజు ఓ వీడియో పంపాడు. ఆ వీడియోలో శ్రీను తన తల్లి దీన పరిస్థితిని వివరించారు.
కోడి కత్తి కేసులో (Kodi Katti Case) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (Cm Jagan) ఎన్ఐఏ కోర్టులో (NIA court) ఎదురు దెబ్బ తగిలింది. కోడి కత్తి కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని జగన్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు ఒకటికి వాయిదా వేసింది.
విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (Jagan Mohan Reddy) కోడికత్తితో (Kodikatti case) జరిగిన హత్యాయత్నం కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో బుధవారం కూడా విచారణ జరిగింది.
కోడికత్తి కేసులో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసును ఈ నెల 11కు ఎన్ఐఏ న్యాయమూర్తి వాయిదా వేశారు. కేసు విచారణ అనంతరం కోడికత్తి కేసు నిందితుడు శ్రీను తరుఫు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదు సంవత్సరాల నుంచి శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడన్నారు.
కోడికత్తి కేసు విచారణ జూన్ 15కు వాయిదా పడింది. గురువారం ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా ఎన్ఐఏ తరపున లాయర్ హాజరుకాకపోవడంతో పాటు వేసవి సెలవుల కారణంగా కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
విజయవాడ: కోడికత్తి కేసు (Kodikatti Case) విచారణ మే 10వ తేదీకి వాయిదా పడింది. నిందితుడు శ్రీనివాస్ (Srinivas)ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్ (Video Call)లో ఎన్ఐఏ కోర్టు (NIA Court) విచారించింది.