Home » Kolkata
కోల్‌కతా హత్యాచార ఘటన నిందితుడు సంజయ్ రాయ్.. పాలీగ్రాఫ్ పరీక్షలో ఒకదానికొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పాడు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమత తీరుపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్‌ట్రాక్/పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం ఆరు మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి సోమవారం పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు అధికారులు బయటకి వెల్లడించలేదు.
మహిళా జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంతోపాటు కాలేజీలోని ఆయన ఆఫీసులో సీబీఐ ఆదివారం సోదాలు జరిపింది.
కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ తన నేరాన్ని అంగీకరించాడని కోల్‌కతా పోలీసులు గతంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు నిందితుడు మాత్రం తనను ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే నేడు CBI ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహించనుంది.
జూనియర్ వైద్యురాలిపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని.. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ‘కావాలంటే నన్ను ఉరి తీసుకోండి’ (అమీ ఫాసీ దీయే దీ) అని పోలీసుల విచారణలో చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఇప్పుడు మాటమార్చేశాడు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రొ. ఘోష్‌పై కేసు నమోదు చేయాలని కోల్‌కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తాను నిర్దోషినంటూ కోర్టులో భావోద్వేగానికి గురయ్యాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ శనివారంనాడు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు జైలులో పోలీగ్రాఫ్ టెస్ట్ జరపగా, సందీప్ ఘోష్, మరో నలుగురు డాక్టర్లను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించింది.
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఈ దారుణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే నిందితుడు సంజయ్ రాయ్ తల్లి తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఇంకా ఏం చెప్పారనే వివరాలను ఇక్కడ చుద్దాం.