Share News

Kolkata Doctor Case: నాకు ఏ పాపం తెలియదు.. కోర్టులో సంజయ్ రాయ్ కంటతడి

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:58 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ తాను నిర్దోషినంటూ కోర్టులో భావోద్వేగానికి గురయ్యాడు.

Kolkata Doctor Case: నాకు ఏ పాపం తెలియదు.. కోర్టులో సంజయ్ రాయ్ కంటతడి

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు (Kolkata doctor rape-murder case)లో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ (Sanjay Roy) తాను నిర్దోషినంటూ కోర్టులో భావోద్వేగానికి గురయ్యాడు. కేసులో నిందితుడు, అనుమానితులపై పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోల్‌కతో కోర్టులో సంజయ్‌రాయ్‌ని సీబీఐ హాజరుపరిచినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

Kolkata rape and murder case: పాలీగ్రాఫ్ టెస్ట్‌లో సిబీఐ ప్రశ్నల పరంపర.. ఏం అడిగిందంటే..?


sanjoy.jpg

పాలీగ్రాఫ్‌ టెస్ట్‌కు ఎందుకు సమ్మతి తెలుపుతున్నావని రాయ్‌ని కోర్టు ప్రశ్నించినప్పుడు అతను కంటతడి పెట్టాడు. తాను అమాయకుడినని బలంగా నమ్ముతున్నందునే లై-డిటెక్టర్ టెస్ట్‌కు అంగీకరించానని చెప్పాడు. ''నేను ఎలాంటి నేరం చేయలేదు. నన్ను ఇరికించారు. పాలిగ్రాఫ్ టెస్ట్‌లో ఆ విషయం బయటపడొచ్చు'' అని ఆశాభావం వ్యక్తం చేశాడు. అనంతరం రాయ్‌కి పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతిస్తూ, 14 రోజుల జ్యుడిషిల్‌ కస్టడీకి ఆదేశించింది. సంజయ్ రాయ్‌తో పాటు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, మరో ఐదుగురికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 05:41 PM