Share News

బెంగాల్లో 48వేల రేప్‌ కేసులు పెండింగ్‌

ABN , Publish Date - Aug 27 , 2024 | 05:02 AM

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత తీరుపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్‌ట్రాక్‌/పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం ఆరు మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది.

బెంగాల్లో 48వేల రేప్‌ కేసులు పెండింగ్‌

  • మమతపై కేంద్రం ఫైర్‌.. సీఎంకు కేంద్రమంత్రి లేఖ

న్యూఢిల్లీ, ఆగస్టు 26: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత తీరుపై కేంద్రప్రభుత్వం విరుచుకుపడింది. ఆ రాష్ట్రానికి తాము 123 ఫాస్ట్‌ట్రాక్‌/పోక్సో కోర్టులు మంజూరు చేస్తే కేవలం ఆరు మాత్రమే ఏర్పాటు చేశారని ఆక్షేపించింది.

అది కూడా గత ఏడాదే అందుబాటులోకి తెచ్చారని పేర్కొంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఘాటుగా ఆమెకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 90 రేప్‌ కేసులు నమోదవుతున్నాయని.. దోషులకు 15 రోజుల్లోనే కఠిన శిక్షలు విధించేలా పార్లమెంటులో చట్టం చేయాలని మమత ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాశారు.

దీనిపై అన్నపూర్ణాదేవి తీవ్రంగా స్పందించారు. బెంగాల్లో 48,600 అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. కష్టాల్లో ఉన్న మహిళలు, పిల్లలను ఆదుకోవడానికి కేంద్రం.. 181, 112, 1098, 1930 హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులోకి తెస్తే.. ఎన్ని సార్లు గుర్తుచేసినా మమత సర్కారు వీటిని అమలు చేయలేదన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 05:02 AM