Home » Kollu Ravindra
Andhrapradesh: వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాలంటీర్లు వెళుతున్నారని.. వలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదన్నారు. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వలంటీర్లను దూరం పెట్టిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా వలంటీర్లను కొనసాగిస్తామన్నారే గానీ తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. కేవలం సీఎం జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు.
సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యల వెనుక నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు చంద్రబాబు ఓ కమిటీని ఏర్పాటు చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) తెలిపారు. జిల్లాలోని వైసీపీ ప్రభుత్వ అరాచకాల కారణంగానే చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అన్నారు.
‘జర్నలిస్టుల హౌస్ సైట్ ఫైల్‌ను చెత్త కుప్పలో వేసిందెవ్వరు? మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కృష్ణ జిల్లా: మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం బ్యానర్లు కడుతున్నాడని ఉల్లిపాలెంకు చెందిన యశ్వంత్ అనే యువకుడిని పేర్ని కిట్టు అనుచరులు చితకబాదారు.
Andhrapradesh: టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా బీసీల అభిప్రాయాలు..ఆలోచనలు తెలుసుకోవడం జరిగిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా.. సామాజికంగా.. ఆర్థికంగా.. విద్యాపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన అని తెలిపారు.
మచిలీపట్నంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా విశ్వబ్రాహ్మణ కాలనీలో స్వర్ణకారుల కార్యశాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. స్థానికంగా స్వర్ణకారులు తెలిపిన సమస్యలపై స్పందిస్తూ.. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్వర్ణకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ యువతని ప్రోత్సహిస్తుందని.. బీసీలంటే టీడీపీ అని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేసేవరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలని మాజీమంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. మచిలీపట్నంలో బూత్ కన్వీనర్ల సమావేశం మంగళవారం నాడు జరిగింది. కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ శిబిరం నిర్వహించారు.
వైసీపీ ( YCP ) నేతలు కేశినేని నాని, కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ) హెచ్చరించారు.
Andhrapradesh: ‘రా...కదలిరా’ సభలకు వస్తున్న అశేషజనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మాట తప్పను - మడమ తిప్పను, విశ్వసనీయతతో ఉంటానన్న జగన్ ప్రజల్ని, రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డారని విమర్శించారు.