Share News

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Jun 14 , 2024 | 01:38 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Chandrababu: కృతివెన్ను ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృత్తివెన్ను రోడ్డు ప్రమాద క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముందస్తుగా రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొని ఆరుగురు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావులతో కలిసి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు.


సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మృతులు ఒకొక్కరికి రూ.5లక్షలు చొప్పున మొత్తం రూ.30 లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని ఈ రోజు సాయంత్రం లోపు అందజేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

Updated Date - Jun 14 , 2024 | 01:38 PM