Share News

AP News: ఆ ఫైల్‌ను చెత్త కుప్పలో వేసిందెవ్వరు?.. విచారణ జరపాల్సిందే: కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:20 PM

‘జర్నలిస్టుల హౌస్ సైట్ ఫైల్‌ను చెత్త కుప్పలో వేసిందెవ్వరు? మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

AP News: ఆ ఫైల్‌ను చెత్త కుప్పలో వేసిందెవ్వరు?.. విచారణ జరపాల్సిందే: కొల్లు రవీంద్ర

కృష్ణా జిల్లా, మచిలీపట్నం: ‘జర్నలిస్టుల హౌస్ సైట్ ఫైల్‌ను చెత్త కుప్పలో వేసిందెవ్వరు? మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలి.’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో భద్రంగా ఉండాల్సిన జర్నలిస్ట్‌ల హౌస్ సైట్ ఫైల్ చెత్త కుప్పలో దొరకడంపై కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ ఘటనపై కలెక్టరేట్‌లో సమాచార శాఖ డీడీని కలిసి ఆయన వివరణ కోరారు. దీంతో పది రోజుల క్రితం ఆఫీస్‌లో ఫైల్ మిస్ అయిందని రవీంద్రకు డీడీ తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించాలని డీడీ చెప్పారు. డీడీ పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొల్లు రవీంద్ర భాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 04:20 PM