Home » Komati Reddy Venkat Reddy
రహదారులు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎస్టిమేషన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తున్నారంటూ ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మానవత్వం ఉన్నవారెవరూ మూసీ ప్రాజెక్టును అడ్డుకోబోరని, అయినా నల్లగొండ జిల్లా ప్రజలు ఇంకా మూసీ బాధలు ఎన్నాళ్లు పడాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
భద్రకాళి అమ్మవారిని ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని మాటిచ్చారు. భద్రకాళి జలాశయాన్ని తాగునీటి జలయశంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎంబీబీఎస్ సీటు సాధించినా ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోతున్న ఓ గిరిజన విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేయూతనందించారు.
రాష్ట్రంలో ఎక్కడా మట్టి రోడ్లు లేకుండా చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్.. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్లోని మంత్రులపై ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్ స్పందించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కిషోర్‌కు లేదన్నారు. అయినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నీ వయస్సు ఎంత అని కిషోర్‌ను సూటిగా ఎమ్మెల్యే సామేల్ ప్రశ్నించారు.
అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని.. అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
పార్లమెంట్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేదవారికి తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.
నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిమంది ప్రజల జీవితాలతో ముడిపడ్డ మూసీ ప్రక్షాళన పనులను అడ్డుకుంటే మరో ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ నేతలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.
Telangana: ‘‘మాకు పదేళ్ల కింద 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేది? వాడు(కేటీఆర్) తలకాయ ఉండి మాట్లాడుతున్నారా. వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అరె పిచ్చి కేటీఆర్.. చేసేదే చెప్పాము. మీలాగా అమలు కానీ హామీలు ఇవ్వలేదు’’