Komatireddy: కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ మంత్రి
ABN , Publish Date - Oct 19 , 2024 | 02:56 PM
Telangana: ‘‘మాకు పదేళ్ల కింద 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేది? వాడు(కేటీఆర్) తలకాయ ఉండి మాట్లాడుతున్నారా. వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అరె పిచ్చి కేటీఆర్.. చేసేదే చెప్పాము. మీలాగా అమలు కానీ హామీలు ఇవ్వలేదు’’
హైదరాబాద్, అక్టోబర్ 19: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR), మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం, మిషన్ కాకతీయ, భగీరథ ఇంకా ఏవో పేర్లు చెప్పి 7 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ‘‘మాకు పదేళ్ల కింద 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేది? వాడు(కేటీఆర్) తలకాయ ఉండి మాట్లాడుతున్నారా. వంద అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అరె పిచ్చి కేటీఆర్.. చేసేదే చెప్పాము. మీలాగా అమలు కానీ హామీలు ఇవ్వలేదు. ఎంత కష్టం అయినా నెల మొదటి రోజే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. కేటీఆర్, హరీష్‌కు ఏం పుట్టింది మీకు రాజకీయాలు వస్తాయా.. అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓడిపోయిన బీఆర్ఎస్ వాళ్ళు వేరే దేశానికి వెళ్లి బ్రతుకుతారు అనుకున్నా.. కానీ సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో అనారోగ్యం బారిన పడిన వారు చాలా మంది ఉన్నారని.. ఎన్నో వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్‌టీపీలతో సమస్య పరిష్కారం కాదని.. స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని మంత్రి తెలిపారు.
Benjamin Netanyahu: ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి
ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్‌ఎల్‌బీసీ అని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ, మూసీ శుద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందుస్తున్నట్లు తెలిపారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర మంది వాడిన నీరు నల్గొండలో పారుతోందన్నారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీలో 5 వేల కోట్లు దోచుకుతిన్నారని మండిపడ్డారు. కేసీఆర్ కొడుకు అంటే గుర్తు పడతారు కానీ.. కేటీఆర్ అంటే ఎవరూ గుర్తు పట్టరంటూ వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయినా అహం తగ్గలేదన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి వేల కోట్లు సంపాదించి ఎక్కడ పెట్టుకోవాలో తెలియని డబ్బులు సంపాదించారంటూ మండిపడ్డారు. కేటీఆర్.. నల్గొండ మంత్రులు రెచ్చగొడితే రెచ్చి పోరని, స్వతహాగా పౌరుషం ఉన్న వ్యక్తులమని స్పష్టం చేశారు.
YS Jagan: చేసిదంతా చేసి.. నీతులు చెబుతున్నారా..!
ఆయన గురించి మాటలు వేస్ట్...
అసలు కేటీఆర్, హరీష్ రావులు నాయకులే కాదని అన్నారు. అన్నింటిలో భాగస్వామ్యాలు ఉన్నాయని.. నారాయణ సంస్థల్లో హరీష్‌కు వాటా ఉందని తెలిపారు. కిషన్ రెడ్డికి ఏమీ తెలియదని.. ఆయన గురించి మాట్లాడం వేస్ట్ అంటూ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయ నాయకుడు కాదన్నారు. కేటీఆర్, హరీష్ దొంగలని... అందుకే వాళ్ళ విషయాలు అందరికీ తెలియాలని మాట్లాడుతున్నానన్నారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసి కాళ్ళు పట్టుకుని మరీ ఇండియాకు రావొద్దని బ్రతిమిలాడినట్లు తెలిపారు. కేటీఆర్, హరీష్ రావులకు నల్గొండ వాళ్లంటే ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు. ‘‘విషం పెట్టి చంపండి, లేదంటే మేమే చచ్చి పోతాం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ మూసీ ప్రజలను రెచ్చ గొడుతున్నారుని.. వాళ్ళ ఇంటి వద్ద ఎక్కడపడితే అక్కడ శాంతియుత పద్ధతిలో నిరసన చెబుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Sudheer Reddy: మూసీ సుందరీకరణ.. సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్
CM Revanth Reddy: తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారు
Read Latest Telangana News And Telugu News