Home » KonaSeema
అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు లోనై చిన్నతనం నుంచి చిన్నచిన్న చోరీలతో ప్రస్థానం ప్రారంభించిన దొంగలు అంతర్ జిల్లా స్థాయిలో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ బీఆ
కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 13న నిర్వహించ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశం వాయిదా వేసినట్టు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకురాలు పి.జ్యోతిలక్ష్మీదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులు నేరుగా ధాన్యాన్ని సమీప మిల్లులకు అమ్ముకునే విధంగా కార్యచరణ రూపొందించి అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ విధానం ప్రారంభ దశలో సజావుగానే సాగింది. అనంతరం అఽధికారుల అలసత్వం కారణంగా రైతులు పండించిన ధాన్యం కళ్లాల్లో నిలిచిపోయింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు బహుళ ప్రయోజనకరంగా ఉన్నప్పుడే శక్తివంతంగా, ఆర్థిక లాభదాయకంగా రూపాంతరం చెందగలవని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి చెప్పారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం జేసీ అద్యక్షతన నిర్వహించారు.
15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలు అమలుచేసి సత్ఫలితాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జిల్లాలను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతీ పథకం కార్యాచరణ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 13న స్వర్ణాంధ్ర-2047 డ్యాకుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించారని తెలిపారు.
విహారయాత్ర విషాదాంతమైంది. చిమ్మ చీకటి ఆపై ‘అలిసి’న ప్రయాణం శాపంగా మారి ఆయువు తీసింది.. చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం సాగించే భార్యాభర్తలు, చక్కనైన ఇద్దరు కుమారులు..హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబ ప్రయాణం మంగళవారం తెల్లవారుజామున కుదుపులకు గురైంది. భార్య, ఇద్దరు పిల్లలను పోగొట్టుకుని ఓ వ్యక్తి ఒంటరిగా మిగిలాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడిమూడి శివారు చింతావారిపేటలో మంగళవారం తెల్లవారుజామున ప్రధాన పంట కాల్వలోకి కారు దూసుకుపోయిన సంఘటన ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.
ఆత్రేయపురం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం సినీనటుడు శుభలేఖ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్లోని గోదావరి భవన్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని 13 కేంద్రాల్లో ఆదివారం జాతీయ ఉపకార వేతన పరీక్షను నిర్వహించగా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీంబాషా జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 2815 మందికి గాను 2688 మంది ఎన్ఎంఎంఎస్ పరీక్షకు హాజరయ్యారు.