Share News

వెంటూరులో కారుణ్య అంత్యక్రియలు పూర్తి

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:20 AM

రాయవరం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తండ్రి కర్కశానికి బలైన చిన్నారి పిల్లి కారుణ్య(7)కి మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరులో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈనెల 17న వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు తన కుమార్తె కారణ్యను, కుమారుడు

వెంటూరులో కారుణ్య అంత్యక్రియలు పూర్తి
పిల్లి రాజు

రాయవరం, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తండ్రి కర్కశానికి బలైన చిన్నారి పిల్లి కారుణ్య(7)కి మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరులో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈనెల 17న వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు తన కుమార్తె కారణ్యను, కుమారుడు రామ్‌సందీప్‌ను స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకువస్తూ రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు సమీపంలో గజపతినగరం వద్ద కాలువలో తోసేసిన ఘటన పాఠకులకు విధితమే. ఈ సంఘటనలో కారుణ్య కాలువలో కొట్టుకుపోయి మృతి చెంద గా మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటూరులో రోధనల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన క్రమం లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆర్థిక సమస్యలే కారణమా?

వెంటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు వ్యాపారలావాదేవిల నేపథ్యంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజు తన పిల్ల ల్ని చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావి స్తున్నారు. పిల్లల్ని తోసేసిన తరువాత రాజు మాత్రం అక్కడి నుంచి తన మోటారు వాహ నంపై పరారు కాగా, రెండో రోజు రాజు ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు సాంకేతికత ఆధారంగా రాజు ఆచూకీని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజు బతికి ఉన్నాడా లేక తాను చనిపోవాలని నిర్ణయించుకుని ఎక్కడికైనా వెళ్లిపోయాడా అనే మిస్టరీ వీడడం లేదు.

రాజు కోసం పోలీసుల గాలింపు

ద్రాక్షారామ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): కన్న పిల్లలను కాలువలోకి తోసి కుమార్తె మృతికి కారణమైన తండ్రి పిల్లి రాజు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కారుణ్య మృతిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎం.లక్ష్మణ్‌ తెలిపారు. అప్పుల బాధ తాళలేక ఈ ఘోరానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన కుమారుడు సందీప్‌ ఘటన పూర్వాపరాలు వెల్లడించారు. పిల్లి రాజు(40) తన పిల్లలను కాలువలోకి తోసి ఏపీ39హెచ్‌కె 1660 నెంబరు గల సుజుకి యాక్సెస్‌ మెరూన్‌ కలర్‌ మోటార్‌ సైకిల్‌పై పారిపోయాడు. రాజు తెలుపు రంగు షర్టు, నలుపు/నీలం రంగు ప్యాంటు ధరించి ఉ న్నాడు. అతడి ఆచూకీ తెలిస్తే రామచంద్రపు రం డీఎస్పీ 9440796507, సీఐ 34407965 36, ఎస్‌ఐ 9440904850లో సమాచారం ఇవ్వాలని దర్యాప్తు అధికారి సీఐ ఎం.వెంకటనారాయణ కో రారు. ఈమేరకు రాజు ఫొటో విడుదల చేశారు.

Updated Date - Mar 19 , 2025 | 12:20 AM