Home » KTR
సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం పోలీసులు చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. దీని వెనుక బలమైన కుట్రకోణం ఉందన్నారు. రాష్ట్రంలో సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు. ఫామ్‌హౌస్‌కు సొంత ఇంటికి సంబంధం ఏంటని అడిగారు.
జన్వాడ ఫామ్‌హౌస్ ఇష్యూ పై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) స్పందించారు. రాజు పాకాల ,శైలేంద్ర పాకాల ఇళ్లల్లో పోలీసుల సోదాలపై డీజీపీకి కేసీఆర్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్‌రెడ్డి చరిష్మా తెలుస్తుందని చెప్పారు.
జన్వాడ ఫామ్ హౌస్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ మద్దూరిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలను విజయ్ మద్దూరి వెల్లడించారు. రాజ్ పాకాల వద్ద నుంచే కొకైన్ తీసుకొని తాను సేవించినట్లు విజయ్ మద్దూరి అంగీకరించాడు.
కేటీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి డైవర్షన్లోనే ఇది జరుగుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి చీకటి మిత్రుడు బండి సంజయ్ ముందుగానే ప్రతి విషయంలో రియాక్ట్ అవుతున్నారని చెప్పారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్ రావుతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల గురించి మాట్లాడిస్తున్నారని ఫైర్ అయ్యారు.
మొకిలా ఫామ్‌హౌస్ కేసు విచారణ జరుగుతుందని సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిన్న(శనివారం) అర్థరాత్రి మొకిలా ఫామ్‌హౌస్‌పై ఎస్వోటీ ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారని తెలిపారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో 21మంది పురుషులు, 14మంది మహిళలు గుర్తించినట్లు చెప్పారు. విదేశీ మద్యంతో పాటు గేమింగ్ సంబంధిత అంశాలు గుర్తించినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి చెప్పిన రూ. లక్షన్నర కోట్ల మాట తాను అంటే తనపై ప్రభుత్వం కేసు పెట్టిందని, వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీలు, గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయారని కేటీఆర్ ఆరోపించారు. మూసి ప్రాజెక్టు వెనుక ఉన్న మూటల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.
కేటీఆర్ బామ్మర్ది రాజ్ ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ నిర్వహించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ టార్గెట్‌గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో.. బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.
తెలంగాణ పోలీస్ శాఖలో పని చేస్తున్న 39మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పని భారం గురించి ప్రశ్నించిన పోలీస్ సిబ్బందిపై వేటు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
కేసీఆర్ ప్రభుత్వం మహత్తర కార్యం చేపట్టిందని, నేతన్నల తలరాత మార్చేందుకు తీసుకున్న ఒక మెగా సంకల్పమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టుదలతో రాష్ట్రానికి భారీ పెట్టుబడి.. కిటెక్స్ పట్టుకొచ్చిందన్నారు. ప్రపంచస్థాయి సంస్థలను ఒప్పించి.. రప్పించి.. కాకతీయ టెక్స్ టైల్ పార్కును కళ కళలాడించేందుకు చేసిన కృషి ఫలాలు ఇవని పేర్కొన్నారు.