TG News: జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి...
ABN , Publish Date - Oct 27 , 2024 | 05:32 PM
జన్వాడ ఫామ్ హౌస్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ మద్దూరిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలను విజయ్ మద్దూరి వెల్లడించారు. రాజ్ పాకాల వద్ద నుంచే కొకైన్ తీసుకొని తాను సేవించినట్లు విజయ్ మద్దూరి అంగీకరించాడు.
హైదరాబాద్: జన్వాడ ఫామ్ హౌస్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ మద్దూరిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలను విజయ్ మద్దూరి వెల్లడించారు. రాజ్ పాకాల వద్ద నుంచే కొకైన్ తీసుకొని తాను సేవించినట్లు విజయ్ మద్దూరి అంగీకరించాడు. మోకిలా పోలీసులకు విజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కేసులో విజయ్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. రాజ్ పాకాలకు కొకైన్ ఎలా వచ్చింది. ఎవరు వద్ద నుంచి వచ్చింది. కొకైన్ ఎవరు విక్రయించారు. ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విచారణకు హాజరు కాని రాజ్ పాకాల...
కాగా.. రెండు చోట్ల విచారణకు రాజ్ పాకాల హాజరు కాలేదు. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయం, 2గంటలకు మోకిలా పోలీస్ స్టేషన్ విచారణకు రాజ్ పాకాల డుమ్మా కొట్టారు. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసుకుని రాజ్ పాకాల అందుబాటులోకి రాలేదు. 24 గంటలు చూసి వారెంట్ జారీ చేస్తామని మోకిలా పోలీసులు చెబుతున్నారు.
తరచూ రాజ్ పాకాల రేవ్ పార్టీలు
అియితే.. రేవ్ పార్టీలో పాల్గొన్న మహిళలు డ్రగ్స్ శాంపుల్స్ ఇచ్చేందుకు నిరాకరించారని మోకిలా పోలీసులు తెలిపారు. రాజ్ పాకాల రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు సీఈఓగా ఉన్నారని మోకిలా పోలీసులు చెప్పారు. ETG కంపెనీకి సీఈఓగా విజయ్ మద్దూరి ఉన్నారు. నార్కోటిక్ కేసులో A1గా రాజ్ పాకాల, A2గా విజయ్ మద్దూరిని ఎఫ్ఐఆర్‌లో మోకిలా పోలీసులు చేర్చారు. Sec 25,27,29 NDPSAA,3,4TSGA కేసు నమోదు చేశారు. రాత్రి 11.30గంటల ప్రాంతంలో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ కోటేశ్వరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోకిలా పీఎస్‌లో కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల కంపెనీలో సీఈవోగా విజయ్ మద్దూరి పనిచేస్తున్నారు. నూతన ఫామ్‌హౌస్‌లో దీపావళి పార్టీ కోసం రాజ్ పాకాల పిలిచాడని విజయ్ తెలిపారు. కొకైన్ తీసుకోవాలని చెప్పాడని పోలీసులకు విజయ్ తెలిపారు. వీకెండ్‌లో తరచూ రాజ్ పాకాల పార్టీలు నిర్వహించేవారని. వీకెండ్స్‌లో రాజ్ పాకాల ,విజయ్ మద్దూరి ఇద్దరు కలిసి డ్రగ్స్ పార్టీలు చేసుకునేవారని మోకిలా పోలీసులు వెల్లడించారు.
రాజ్ పాకాల విల్లా దగ్గర తీవ్ర ఉద్రిక్తత...
రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల ఫామ్‌హౌస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఇవాళ(ఆదివారం) ఆందోళన చేపట్టారు. దీంతో విల్లా దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాయింట్ కమిషనర్ ఎక్సైజ్ ఖురేషి నేతృత్వంలో సోదాలు నిర్వహించడానికి వచ్చారు. అయితే ఎక్సైజ్ శాఖ సోదాలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్, సంజయ్‌తో పాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా విల్లా వద్దకు చేరుకున్నారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవద్దని ఎక్సైజ్ పోలీసులు నచ్చజెపుతున్నారు. ఎక్సైజ్ పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
సెర్చ్ వారెంట్ చూపాలని ఎక్సైజ్ పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. విల్లా లోపలకు వెళ్లేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.కేటీఆర్ విల్లా పక్కనే రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకాల విల్లా ఉంది. సెర్చ్ చేసేందుకు మీడియేటర్లను ఎక్సైజ్ అధికారులు పిలిపించారు. తమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు వాదనలు వినిపించారు. ఎక్సైజ్ పోలీసులు జేబులు తనిఖీ చేశాక లోపలకు పంపిస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. ఫామ్‌హౌస్‌లో సోదాలు చేయొద్దని గులాబీ శ్రేణులు నినాదాలు చేస్తూ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, గులాబీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకరికి కొకైన్ పాజిటివ్..
మొకిలా ఫామ్‌హౌస్ కేసు విచారణ జరుగుతుందని సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిన్న(శనివారం) అర్థరాత్రి మొకిలా ఫామ్‌హౌస్‌పై ఎస్‌వోటీ ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారని తెలిపారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో 21మంది పురుషులు, 14మంది మహిళలను గుర్తించినట్లు చెప్పారు. విదేశీ మద్యంతో పాటు గేమింగ్ సంబంధిత అంశాలు గుర్తించినట్లు వివరించారు. గేమింగ్ సంబంధిత అంశాలపై విచారణ జరుగుతుందని అన్నారు. పురుషులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించామని ఒకరికి కొకైన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.. విజయ్ మద్దూర్‌కి పాజిటివ్ రావడంతో రక్త పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఎన్డీపీఎస్ చట్టం U/S 25,27, 29 కేసు నమోదు చేశామని తెలిపారు. తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3&4 ప్రకారం రాజ్‌పాకాల, విజయ్ మద్దూరిపై మోకిలా పీఎస్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీకి అనుమతి లేనందున ఆయనపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎక్సైజ్ చట్టం 34 A, (1) ,R/W 9 కింద కేసు నమోదు చేశారని తెలిపారు. జాన్వాడ ఫామ్‌హౌస్ పార్టీపై విచారణ కొనసాగుతోందని సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
భారీగా లిక్కర్ స్వాధీనం
హైదరాబాద్ శివారు జన్వాడలో(Janwada) జరుగుతున్న రేవ్ పార్టీని (Rave party) పోలీసులు భగ్నం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) బావమరిది రాజ్ పాకాలకు (Raj Pakala) చెందిన ఫాంహౌస్‌లో ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగి ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలు,35 మందితో లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుగుతోందని పోలీసులు తెలిపారు. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు, ప్లేయింగ్ కార్డ్స్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10.5 లీటర్ల విదేశీ మద్యం, 10 లూజ్ ఇండియన్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై U/S 34A, 34(1), R/w 9 Of ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: మూసీకి పునరుజ్జీవం కల్పిద్దాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Kishan Reddy: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Bhatti Vikramarka: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది
Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..
AV Ranganath: అనుమతులుంటే కూల్చం
KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
Read Latest Telangana News and Telugu News