Home » KTR
కేసీఆర్ ప్రభుత్వం మహత్తర కార్యం చేపట్టిందని, నేతన్నల తలరాత మార్చేందుకు తీసుకున్న ఒక మెగా సంకల్పమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టుదలతో రాష్ట్రానికి భారీ పెట్టుబడి.. కిటెక్స్ పట్టుకొచ్చిందన్నారు. ప్రపంచస్థాయి సంస్థలను ఒప్పించి.. రప్పించి.. కాకతీయ టెక్స్ టైల్ పార్కును కళ కళలాడించేందుకు చేసిన కృషి ఫలాలు ఇవని పేర్కొన్నారు.
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని ఆరోపించారు.
‘‘మా మాటలు మొరటైనా నేను, సీఎం రేవంత్‌రెడ్డి మంచోళ్లం. కేటీఆర్.. నీ సోషల్ మీడియాను అదుపులో పెట్టుకో. నీకు కొంచెం గౌరవం ఇస్త. కాదని మాపై తప్పుడు రాతలు రాయిస్తే..
తెలంగాణపై పదేళ్లలో రూ.8లక్షల కోట్లను మాజీ సీఎం కేసీఆర్ అప్పు చేశారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఏ పథకాన్ని ఆపలేదు. త్వరలోనే పథకాలను గ్రౌండ్ చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో విడతాల వారిగా చేసిన దానికంటే తాము రుణమాఫీ చేసిన మొత్తం ఎక్కువేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఇటీవల ఆదిలాబాద్‌లో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్... రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం
కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని, ఈ టెన్షన్లోనే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.
జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజకీయ వ్యభిచారులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని నవంబర్ 1వ తేదీ నుంచి 8 తేదీలోపు అరెస్టుల పరంపరం మొదలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వెల్లడించారు. ఆ అరెస్టయ్యే వారి జాబితాలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారు సైతం ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అలాంటి వేళ.. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ కాన్క్లేవ్లో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.