Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Oct 26 , 2024 | 04:27 AM
కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని, ఈ టెన్షన్‌లోనే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని, ఈ టెన్షన్‌లోనే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. పార్టీ మారిన వారు వ్యభిచారులంటూ కేటీఆర్ మాట్లాడుతున్నాడని, పదేళ్లలో 60 మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్న కేసీఆర్‌కు ఏ పేరు పెట్టాలో ఆయనే చెప్పాలని ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు.
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రె్‌సకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎనలేని సేవలు చేశారని, ఆయన్ను పార్టీ కాపాడుకుంటుందని మధుయాష్కీ గౌడ్ అన్నారు. గంగారెడ్డి హత్యతో జీవన్‌రెడ్డి పార్టీ నాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి మధుయాష్కీ పరామర్శించారు. పార్టీ, ప్రభుత్వం పట్ల జీవన్‌రెడ్డి తెలిపిన అభ్యంతరాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు.