Home » Kutami
అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి ఓ రూపు తెచ్చే దశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. రాజధాని పనుల పునర్ః నిర్మాణంతో పాటు కేంద్ర సంస్థలను రాజధానికి రప్పించేందుకు చర్యలు చేపడుతోంది. 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎమ్మెల్యేగా గెలవడం, ఆపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంపై ధర్మవరం (Dharmavaram) బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్(Minister satyakumar) స్పందించారు. తన గెలుపు కార్యకర్తలు పెట్టిన భిక్ష అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ఘన విజయంతో సాధించడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు(CM Chandrababu) సహా మంత్రులుగా పలువురు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఇప్పటికే శాఖలు సైతం కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి(Kutami) ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని నటుడు సుమన్(Actor Suman) అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఐదేళ్లు వెన్నక్కి వెళ్లిందని, ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కూటమి గెలుపుపై సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొందని, అందరి పోరాటంతోనే అద్భుత విజయం సాధించామని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరి కోరి అప్పగించారని, అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉందని తెలుగుదేశం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని తాను చేసిన శపధాన్ని ప్రజలు గౌరవించారని.. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం ఉదయం జరగనున్నది. ఈ భేటీలో ఎన్డీయే శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది.
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు(TDP chief Chandrababu) నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మంత్రివర్గ ఆశావహులు పెద్దఎత్తున ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అధినేత దృష్టిలో పడేందుకు ఎమ్మెల్యేలు ఆరాటపడుతున్నారు.
AP Politics: ప్రజలు మక్కెలు విరగొట్టి మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ అరాచకాలు ఆగడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhi Ram) అన్నారు. ఏపీ అసెంబ్లీలో 11స్థానాలకే ప్రజలు పరిమితం చేసినా వారిలో మార్పు మాత్రం రాలేదన్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గిరినాథ్ను వైసీపీ సైకో మూకలు దారుణంగా హతమార్చారంటూ ఆయన ఆరోపించారు.