Share News

Polling: పీఏసీ సభ్యుల ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్‌

ABN , Publish Date - Nov 22 , 2024 | 10:39 AM

పీఏసీ సభ్యుల ఎన్నికకు అసెంబ్లీలో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒకవైపు సభ జరుగుతుండగానే మరోవైపు పోలింగ్ జరుగుతోంది. కాగా ఓటింగ్‌ను బహిష్కరించే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది.

Polling: పీఏసీ సభ్యుల ఎన్నికకు ప్రారంభమైన పోలింగ్‌

అమరావతి: అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో (పీఏసీ) సభ్యుల ఎన్నికకు పోలింగ్‌ (Polling) ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్య క్రమంలో ఓటు వేయాలో ఎన్డీఏ కూటమి (NDA Kutami) విప్‌లకు బాధ్యత అప్పగించింది. ప్రజాపద్దులు(పీఏసీ (PAC)), అంచనాలు(ఎస్టిమేట్స్‌), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్‌ జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాలు (Assembly Hall)లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్‌ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు. అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం10 చొప్పున నామినేషన్లు దాఖలవ్వటంతో పోలింగ్‌ అనివార్యమైంది. ఛైర్మన్లుగా పీఏసీకి పులపర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీకి జోగేశ్వర రావు, పీయూసీకి కూన రవికుమార్‌‌ల ఎన్నిక దాదాపు ఖరారు చేశారు.


కాగా వైఎస్సార్‌సీపీ తరుపున పీఏసీ మెంబర్‌కు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అసెంబ్లీకి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, విరూపాక్ష , బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తదితరులు వచ్చారు. ఓటింగ్‌లో పాల్గొనే అంశంపై ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నారు. ఓటింగ్‌ను బహిష్కరించే యోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరికాసేపట్లో అధికారకంగా ప్రకటించే అవకాశముంది.


శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ-పీఏసీ) ఎన్నిక రసవత్తరంగా మారింది. తగినంత బలం లేకపోయినా ఈ కమిటీలో సభ్యత్వం కోసం వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో సంఖ్యాబలం ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు.. ఈ కమిటీ చైర్మన్‌ పదవికి జనసేనకు చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును అంతర్గతంగా ఖరారు చేశాయి. అయినా పెద్దిరెడ్డి పోటీలో కొనసాగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు ఖాయమవడంతో అసెంబ్లీ అధికారులు ఓటింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ వేదికగా పనిచేసే కమిటీల్లో పీఏసీ కీలకమైనది. వివిధ ప్రభుత్వ శాఖలు పెట్టే ఖర్చుకు సంబంధించి కంపోట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ కమిటీ విచారణ జరుపుతుంది. ఏ శాఖకు చెందిన అధికారులనైనా పిలిచి సమీక్ష నిర్వహించే అధికారం దీనికి ఉంది. శాసనసభలో అనేక కమిటీలు ఉన్నా ఈ ఒక్క కమిటీ చైర్మన్‌ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోం ది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన పయ్యావుల కేశవ్‌కు చైర్మన్‌ పదవి ఇచ్చారు. అప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇబ్బంది లేకుండా పోయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పీఏసీ సభ్యులకు తొలిసారి ఎన్నిక..

అదానీ లంచాల యాత్ర.. ఇరుక్కున్న జగన్

అదానీపై కేసు.. తాడేపల్లి ప్యాలెస్‌కు సెగ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 22 , 2024 | 10:39 AM