Pensions: ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Nov 28 , 2024 | 08:54 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ సెలవు దినం అయితే ముందు రోజు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt.,) ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్లను (Social Pensions) పంపిణీ (Distribution) చేస్తోంది. వచ్చే నెల (డిసెంబర్) ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 30నే (శనివారం) పెన్షన్లు పంపిణీ చేయనుంది. విశాఖ జిల్లాలో1,61584 మంది పెన్షన్ దారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ సెలవు దినం అయితే ముందు రోజు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా శుక్రవారం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన భేటీ జరుగుతుంది. ఈ సమావేశానికి 117 అంశాలతో అజెండా సిద్ధం చేశారు.
కాగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గత నెల అక్టోబర్ మొదటిరోజే రాష్ట్రవ్యాప్తంగా 62.88 లక్షల మందికి అందజేశారు. సచివాలయ ఉద్యోగులు ఉదయాన్నే పెన్షన్‌దారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీని ప్రారంభించి 97.64 శాతం పూర్తి చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేందుకు వారిని అక్టోబరు మూడో తేదీ వరకు కొత్త ప్రదేశాల్లో జాయిన్ కావొద్దని సూచించారు. దీంతో ఉద్యోగులు వీలయినంత వరకు తొలి రోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పుచ్చకాయలమాడలో పెన్షన్ల పంపిణీ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఎవరైనా స్థానికంగా పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలలో ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెసులుబాటు కల్పించింది. మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఆ మరుసటి నెల మొత్తం అందించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా దివ్యాంగ విద్యార్థులు స్థానికంగా అందుబాటులో లేకపోతే అలాంటివారికి వారు నివశించే ప్రాంతంలో పెన్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
అభినందించిన సీఎం చంద్రబాబు
పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని, ఒక్క రోజులోనే 98 శాతం లబ్ధిదారులు తమ ఇంటి వద్దనే పింఛన్లు అందుకోవడం సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రికార్డు స్థాయిలో 64.38 లక్షల మంది పింఛన్లు అందించిన సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...
జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News