Home » Kutami
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly) ఎన్నికల్లో తమ విజయం తద్యమని కూటమి అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగిన ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ కూడా అవసరం లేదని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కూటమి తరఫున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులతో అగ్రనేతలు చంద్రబాబు (Chandrababu), అరుణ్ సింగ్, పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) జూమ్ మీటింగ్ నిర్వహించారు.
రాష్ట్రంలో వైసీపీ మూకల దాడులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులపై వేటు వేసింది. అయితే ఈవీఎం, వీవీప్యాట్ పగలకొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకపోవడంతో తమను ఎవరూ ఏం చేయలేరనే భావం వైసీపీ అల్లరి మూకల్లో బాగా పెరిగింది. దీంతో గన్నవరం నియోజకవర్గం సహా రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూటమి శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వైసీపీ(YSRCP) మూకలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రతిపక్షాలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసిన అధికార పార్టీ శ్రేణులు... తాజాగా అధికారులపైనా తమ జులుం ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఎన్నికల అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నారనే వాదనలు కూటమి నేతలు బలంగా వినిపిస్తున్నారు. అయితే తమ మాట వినని అధికారులపై బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని... వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు సెలవులు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎస్ జహవర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని, వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలన్నారు. సీఎస్, అతని కుమారుడు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి భూదందాలను సాక్షాధారాలతో సహా బయటపెట్టామన్నారు. సీఎస్‌గా ఉండే అర్హత ఆయన కోల్పోయారని మండిపడ్డారు.
అమరావతి మే 24: జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని పలు విశ్లేషణలు తేటతెల్లం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె వెబ్ ఎక్స్ వీడియో మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.