Share News

Amaravati: సైబర్‌ బుల్లీస్‌ షీట్‌ తెరుస్తాం.. సోషల్ సైకోల్లో వణుకు..

ABN , Publish Date - Nov 10 , 2024 | 08:32 AM

ఏపీ పోలీసుల వరుస చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సోషల్‌ సైకోలు పలువురు ఏపీని విడిచి పారిపోతున్నారు. మరి కొందరు ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చెయ్యం. వదిలిపెట్టండి అని పోలీసులను వేడుకుంటున్నారు. ఇంకొందరు భయంతో న్యాయవాదుల్ని వెంట బెట్టుకుని ఠాణాలకు వచ్చి రక్షణ కోరుతున్నారు.

Amaravati: సైబర్‌ బుల్లీస్‌ షీట్‌ తెరుస్తాం.. సోషల్ సైకోల్లో వణుకు..

అమరావతి: కూటమి నేతలపై (Kutami Leaders) సోషల్‌ మీడియా (Social Media)లో నీచ వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వారు దారికి వస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆక్రోశం... ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆగ్రహంతో సోషల్‌ సైకోలపై (Social Psychos) పోలీసులు (Police) ఉక్కుపాదం మోపుతున్నారు. వారు పెట్టిన పోస్టులను బట్టి... నోటీసులు ఇవ్వడం, కౌన్సెలింగ్‌ చేయడం, కేసులు పెట్టడం, అవసరమైన చోట అరెస్టులూ చేస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా విషయం వివరిస్తున్నారు. గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేసిన వారిని స్టేషన్లకు పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. లైకులు కొట్టిన వారికి వాట్సాప్‌ ఇతర సోషల్‌ మీడియా ద్వారా 160 సీఆర్పీసీ నోటీసులు పంపారు. మార్ఫింగ్‌ ఫొటోలు, అసభ్యకరమైన వీడియోలు సృష్టించిన వారిపై భారత న్యాయ సంహితలో వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన సెక్షన్‌ 111 ప్రయోగిస్తున్నారు. పోలీసుల వరుస చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సోషల్‌ సైకోలు పలువురు ఏపీని విడిచి పారిపోతున్నారు. మరి కొందరు ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చెయ్యం. వదిలిపెట్టండి అని పోలీసులను వేడుకుంటున్నారు. ఇంకొందరు భయంతో న్యాయవాదుల్ని వెంట బెట్టుకుని ఠాణాలకు వచ్చి రక్షణ కోరుతున్నారు.


చట్ట ప్రకారమే వెళ్లి... తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని, కచ్చితంగా నెల రోజుల్లో ఏపీలో పోలీసింగ్‌ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని సీఎం చంద్రబాబు కేబినెట్‌ భేటీలో పేర్కొన్నారు. దీనికి తగినట్లుగానే క్షేత్రస్థాయిలో చర్యలు మొదలయ్యాయి. విజయవాడ పోలీసులు 3 రోజుల్లోనే వందల మంది సోషల్‌ సైకోలను గుర్తించారు. వీరిలో కరుడు గట్టిన వారికి కౌన్సెలింగ్‌ ప్రారంభించారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ కేసులు, కౌన్సెలింగ్‌తో ఉక్కుపాదం మోపుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టినా, మరొకరికి పంపినా ఇబ్బందులో పడినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు, పార్టీలు, ఇతర సమూహాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉండే పోస్టుల గురించి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సైబర్‌ హిస్టరీ షీట్లలో చిక్కుకుని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని విద్యార్థులు, నిరుద్యోగులను హెచ్చరిస్తున్నారు. విషపూరిత ప్రచారంలో భాగమైతే సైబర్‌ బుల్లీస్‌ షీట్‌ తెరుస్తామని, అదే జరిగితే ఇక్కట్లు తప్పవని చెబుతున్నారు. దీంతో వైసీపీ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ నుంచి వందలమంది నిష్క్రమిస్తున్నారు.


గతంలో చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌లపై అసభ్య వ్యాఖ్యలతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి ఇప్పుడు పేరుపేరునా అందరికీ సారీ చెప్పారు. క్షమాపణ అడుగుతున్నా అంటూ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ముందు కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా మారిన యాంకర్‌ శ్యామల సైతం స్వరం మార్చారు. తెలిసో, తెలియకో తప్పు చేశాం.. క్షమించండి అని వేడుకున్నారు. పోలీసుల కౌన్సెలింగ్‌, కేసులు, అరెస్టుల నేపథ్యంలో వైసీపీ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ నుంచి భారీగా నిష్క్రమణలు మొదలయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత

బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

ఉన్మాదులను వదిలేయాలా..

తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 10 , 2024 | 08:32 AM