Share News

CM Chandrababu: ఇదే డ్రోన్.. ఓ గేమ్ చేంజర్ అవుతుంది..

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:24 PM

కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌ 2024 మంగళవారం ఉద‌యం మంగళగిరిలోని సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో ప్రారంభమైంది. ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు.

CM Chandrababu: ఇదే డ్రోన్.. ఓ గేమ్ చేంజర్ అవుతుంది..

అమరావతి: కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి(National level) డ్రోన్ సమ్మిట్‌ 2024 (Drone Summit 2024) మంగళవారం ఉద‌యం మంగళగిరిలోని సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో ప్రారంభమైంది. డ్రోన్ సాంకేతికత, పరిశోధన, ఉత్పత్తి, శిక్షణ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం రెండురోజుల పాటు డ్రోన్ సమ్మిట్ నిర్వహించనుంది. సమ్మిట్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా 5,500 డ్రోన్లతో ప్రత్యేక షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. సదస్సులో ప్రభుత్వం ముసాయిదా డ్రోన్ పాలసీని వెల్లడించటంతో పాటు అవగాహనా ఒప్పందాలు చేసుకోనుంది.ఈ జాతీయ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) హాజరయ్యారు. నిర్వాహకులు సీఎంకు డ్రోన్లతో స్వాగతం పలికారు.


ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎవ్వరయినా ఏపీకి రావాలంటే సరైన సధుపాయాలు లేవన్నారని, దాంతో తాము ఓపెన్ స్కై పాలీసీ తీసుకువచ్చామన్నారు. 5వేల ఎకరాల భూమిని అక్వైర్ చేసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు నిర్మించామన్నారు. ఆ తరువాత ఒకదాని తరువాత మరోటి ముందుకు తీసుకువెళ్లామని, షంషాబాద్ ఎయిర్ పోర్టు కోసం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో 32 సార్లు సమావేశం అయ్యామన్నారు. ఇప్పడు చెపుతన్నా.. హైదారాబాద్ ఇండియాలో చాలా బెస్ట్ సీటీ అని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇండియా బ్రాండ్ ను ప్రమోట్ చేశారని, డిజిటల్ కరెన్సి విషయంలో రిపోర్టు ఇవ్వాలని ప్రధాని అడిగితే ఇచ్చామని చెప్పారు. ఇప్పడు అత్యధికంగా డిజిటల్ కరెన్సి వాడుతున్న దేశం ఇండియా అని తెలిపారు.


భవిష్యత్తులో డేటా ఆస్తిగా మారుతుందని, మీ దగ్గర డేటా ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాడి అద్బుతాలు చెయ్యెచ్చునని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ లకు ప్రోగ్రాం ఇచ్చి ఇన్మర్మెషన్ తెప్పించుకోవచ్చునని, వరదల సమమంలో ఆహారాన్ని ఫుడ్ సప్లైకి వాడామని చెప్పారు. లక్షా 50 వేల మందికి డ్రోన్ ద్వారా ఆహరం అందించామన్నారు. సిటీలో ఎంత చెత్త పేరుకుపోయిందో డ్రోన్ లు పంపి తెలుసకున్నామన్నారు. దీంతో ఆ చెత్తను వెంటనే ఎత్తేశామని, రేపు ఇదే డ్రోన్ ఓ గేమ్ చేంజర్ అవుతందని ఆయన పేర్కొన్నారు. దీన్ని వ్యావసాయం, మూళిక సధుపాయాలు విషయంలో వాడడం ద్వారా అద్బుతాలు సాధించొచ్చునని అన్నారు. వాటిని ట్రాఫిక్ వైలేషన్, డ్రంకన్ వైలేషన్‌లు జరగకుండా చూస్తున్నామని, భవిష్యత్తులో తప్పుచేసి వారిని పట్టుకోవడానికి డ్రోన్‌లు వాడుతామని చెప్పారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మీకు చెప్పదల్చుకున్నానని.. డ్రోన్ తయారీ దారులకు ఈ సదస్సు ద్వారా ఓ అవకాశం వస్తుందన్నారు. ఇప్పుడు కొన్ని దేశాలు డ్రోన్ లను యుద్దాలకోసం వాడుతున్నారని.. తాను మాత్రం డ్రోన్ ద్వారా డెవలెప్‌మెంట్ చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

డ్రోన్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబుతోపాటు పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ్‌ పార్కు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షో తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఈ సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వక్తలు, ప్రతినిధులు పాల్గొంటారు. వెయ్యి మంది వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నిపుణులు వస్తారు. డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్‌, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగంపై 9 చర్చా సెషన్లు ఉంటాయి. డ్రోన్ల సాంకేతికత వినియోగంపై కీలకమైన నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఉంటాయి. వేదిక వద్ద దేశవ్యాప్తంగా డ్రోన్‌ తయారీదారుల ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: చందానగర్‌లో విషాద ఘటన..

గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాలపై సమీక్షించిన సీఎం

నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 22 , 2024 | 01:40 PM