Home » Lalu prasad yadav
జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రాల్లో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని సంబోధించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో మోదీ ఇచ్చిన రూ.15 లక్షల హామీని గుర్తు చేస్తూ.. ఆయనపై...
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రకటించాలని జేడీయూ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. ఈ కూటమి నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది.
పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన డోరండ ట్రెజరీ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖాండ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సీబీఐ శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
మోదీ ఇంటిపేరు పరువునష్టం కేసులో పడిన శిక్షపై స్టే ఇస్తూ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చిన కొద్దిసేపటకే ఆయనతో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఢిల్లీలోని తన కుమార్తె మీసాభారతి ఇంటికి విందు కోసం రాహుల్‌ను ఆహ్వానించారు.
భూములకు ఉద్యోగాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు జప్తు చేసింది. న్యూ ఫ్రండ్ కాలనీలోని రెసిడెన్షియల్ హౌస్‌తో పాటు లాలూ కుటుంబానికి చెందిన రూ.6 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని, విపక్ష కూటమి ఇండియా గెలుపు ఖాయమని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు.
రాష్ట్రీయ జనతా దళ్ వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతో ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఆడారు. చిరునవ్వులు చిందిస్తూ ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్న వీడియోను ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (NCP) వృద్ధాప్యాన్ని గుర్తు చేస్తూ, క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయనకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit pawar) సలహా ఇవ్వడాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) గురువారం తప్పుబట్టారు.
ఒడిసా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ రైల్వే మంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలు, మృతుల సంఖ్యతో కూడిన చిట్టాను బయటకు తెచ్చింది.