Share News

Bihar Politics: 9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

ABN , Publish Date - Jan 28 , 2024 | 04:56 PM

బిహార్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Bihar Politics: 9వ సారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం

బిహార్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ (Nitish Kumar) 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన మహాఘటబంధన్ కూటమి నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది. అంతకు ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు లేఖ సమర్పించిన తర్వాత నితీష్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Nitish-Oath.jpg

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Nitish Kumar: ‘ఇండియా’ కూటమి నుంచి నితీష్ వైదొలగడానికి కారణమిదేనట..!


నితీశ్ కుమార్‌తో పాటు ఇద్దరు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా పాట్నాలోని రాజ్‌భవన్‌లో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు జేడీయూ, బీజేపీలకు చెందిన ముగ్గురు మంత్రులు, జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా నుంచి ఒకరు, స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ బిహార్ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, ఇతర నాయకులు హాజరయ్యారు.

Updated Date - Jan 28 , 2024 | 05:32 PM