Home » Latest News
సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి అదానీ నుంచి నాటి సీఎం జగన్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారని రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేశ్ వెల్లడించారు.
ప్రభుత్వం- ప్రైవేట్ పార్టీలు, రైతులు- రెవెన్యూ శాఖకు మధ్య తలెత్తిన భూ వివాదాలకు సంబంధించిన వేల కేసులు కోర్టుల్లో సంవత్సరాల తరబడి మూలుగుతున్నాయి.
రాజధాని హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు చెబుతుంటే జగన్ మాత్రం బుకాయిస్తున్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకుంటే అదానీకి ఏం సంబంధం అంటూ జగన్, ఆయన పార్టీ నేతలు అడ్డగోలుగా వాదిస్తున్నారు.
రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కీలకమైన భూ దస్త్రాలు అనేకం శిథిలమయ్యాయి. ఇంకా ఆ దశకు చేరుకోనివి శిథిలమయ్యే ప్రక్రియలో ఉన్నాయి. సంరక్షించాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు.
ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అల్లావుద్దీన్ అద్భుత దీపంలా రాష్ట్రం మారాలని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు.
ప్రపంచానికి తెలుగుజాతి కీర్తిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ద్వారానే తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
సర్వీసులో చేరి ఏళ్లు గడుస్తున్నా పదోన్నతుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది.
వైద్యుడు చికిత్స చేయలేదు. అసలు పేషంటే లేడు. కానీ.. తమకు ఆర్థిక సాయం చేయమంటూ ముఖ్యమంత్రి సహాయ నిధికి పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పైగా ఇవన్నీ వివిధ ఆస్పత్రుల నుంచి కాదు.. ఒకేదగ్గరి నుంచి అందినవి.