Share News

CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:08 PM

CM Chandrababu: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (గురువారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu

అమరావతి: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (గురువారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. బాధ్యులు ఎవరనేది వెంటనే ఫిక్స్ చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. బైరాగిపట్టెడ వద్ద లోపల ఉన్న ఒక మహిళకు గాలి ఆడక స్పృహ తప్పి పడిపోయిందని, ఆమెను కాపాడేందుకు అక్కడి డీఎస్పీ గేటు తీశారని పోలీసులు నివేదికలో తెలిపారు. దర్శనం టిక్కెట్లు కోసం గేటు తీశారని భావించి ఒక్కసారిగా భక్తులు బయటకు వచ్చారని చెప్పారు. గేటు తీయడంతోనే తొక్కిసలాట ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు.


సాయంత్రం 5 గంటల సమయంలో భక్తులు ఎక్కువ మంది వస్తున్నారని అధికారులకు స్థానిక జర్నలిస్టులు చెప్పారని అన్నారు. తొక్కిసలాట జరిగే ప్రమాదముందని చెప్పినప్పటికీ అధికారుల నుంచి పూర్ రెస్పాన్స్ ఎందుకు ఉందని నిలదీశారు. అసలు టీటీడీ ఈఓకు సమాచారం ఎప్పుడు వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. భక్తుల ఏర్పాట్లపై మీ ప్లానింగ్ ఏమిటని అడిగారు. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలీస్, టీటీడీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదికలో తెలిపారు. బాధ్యలను ఫిక్స్ చేసి వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.


అసలు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఈ ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా వస్తారని తెలిసీ ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సాయంత్రం లోపు కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

Minister Anagani: తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్

YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 09 , 2025 | 01:24 PM