Share News

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jan 09 , 2025 | 01:43 PM

MS Raju: శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఎంఎస్ రాజు ఆక్షేపించారు

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు
Tirupati incident

అనంతపురం: తిరుపతి తొక్కిసలాట ఘటన చాలా బాధకరమని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కావాలనే కొంతమంది అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణం అయ్యారని తెలుస్తొందని చెప్పారు. అందరి కంటే ముందే వైసీపీ సోషల్ మీడియాలోకి వీడియోలు ఏలా వచ్చాయనేది దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియాలో టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆక్షేపించారు ఎంఎస్ రాజు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. డాకు మహారాజ్ సినిమా ఈవెంట్ జరగాల్సి ఉంటే తిరుపతి ఘటన వల్ల రద్దయిందని ఎంఎస్ రాజు ప్రకటించారు.


వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి

Gandi--Babji.jpg

విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని విశాఖపట్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి తెలిపారు. మృతుల కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ ఘటనపై వైఫల్యాలకు కారణమైన వారి మీద చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ చెప్పారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశంపై కూడా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. 2.8 లక్షల కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపనలు ప్రారంభించారని చెప్పారు. గతంలో తెచ్చామని చెప్పే వ్యక్తులు, విపక్ష పార్టీలు ఆరోజు ఎందుకు ప్రారంభించలేకపోయారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం దోపిడీల మీదే దృష్టి పెట్టిందని అన్నారు. విమర్శలు చేసే మాజీ మంత్రి, గుడివాడ అమర్నాథ్ రెండున్నర సంవత్సరాల్లో, అనకాపల్లికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. మైకు దొరికింది కదా అని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని గండి బాబ్జి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Tirupati Incident: తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

Minister Anagani: తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్

YS Jagan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 09 , 2025 | 02:08 PM