Home » Latest News
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో దళితబంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని దళితులు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. దళిత బంధు రెండో విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
IPL 2025 Mega Auction: ప్రతి క్రికెట్ అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేశాయి. ఐపీఎల్-2025 మెగా ఆక్షన్ ఆరంభమైంది.
పదేళ్లుగా నెమ్మదిగా పోలవరం నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరానని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న పరిస్థితి, జాప్యానికి కారణాలపై కూడా చర్చ జరగాలని కోరానని చెప్పారు.
పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పక్కా ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
రేవంత్ రెడ్డిది నరం లేని నాలుక అని.. ఏదైనా మాట్లాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను భయపెడతున్నారని మండిపడ్డారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలని.. జగన్‌ను త్వరగా అమెరికా లాక్కెళ్లాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ఆధారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శలు చేశారు. తాను అవినీతి చేయలేదని జగన్ అంటున్నారని... తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ని అమెరికాకు పంపాలని సవాల్ విసిరారు.
ఖమ్మం జిల్లాలో సీతారామ భక్తరామ దాసు ప్రాజెక్ట్‌లతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్మ వారు అమెరికాలో రాణిస్తున్నారని తెలిపారు. తోటి కులాలను గౌరవిస్తూ లౌకిక భావనతో కమ్మ కులం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
వైసీపీ అధినేత జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి. ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేరని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందేనని బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
మిద్దె తోటలు పెచండంలో ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని.. మహిళలు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్తీ ఆహారం పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుందని చెప్పారు.