Share News

Kodanda Reddy: తెలంగాణకు విత్తన చట్టం అవసరం

ABN , Publish Date - Jan 09 , 2025 | 05:06 AM

తెలంగాణలో విత్తన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి అన్నారు.

Kodanda Reddy: తెలంగాణకు విత్తన చట్టం అవసరం

  • నమోదు కమిటీని ఏర్పాటు చేయాలి: కోదండరెడ్డి

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో విత్తన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి అన్నారు. రాష్ట్రస్థాయిలో విత్తన నమోదు కమిటీని ఏర్పాటు చేయాలని, నమోదు చేసిన విత్తన రకాలను రద్దు చేసే అధికారం కూడా ఆ కమిటీకి ఉండాలని అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ‘విత్తన సమస్యలు.. రైతు ప్రయోజనాలు’ అంశంపై బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులు ఉత్పత్తి చేసే విత్తన రకాలు, సంప్రదాయ విత్తనాలు, సహజ విత్తన జన్యు సంపదకు రక్షణ నిబంధనలు ఈ చట్టంలో ఉండాలని అన్నారు. జన్యు మార్పిడి విత్తనాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దని సూచించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వే్‌షరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి నియంత్రణ కమిటీలు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో విత్తన చట్టం అనివార్యతతోపాటు 21 అంశాలపై ఏకగ్రీవ తీర్మానం చేశారు.

Updated Date - Jan 09 , 2025 | 05:06 AM