Home » Lawyer
కోల్కతా వైద్యురాలి మృతిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైద్య సంఘాలు ఆందోళనకు దిగాయి. వీలైనంత త్వరగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ చేసి, దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ధ్వంసం చేశారు
జ్యుడీషియల్ అధికారుల రాష్ట్ర అధ్యక్షుడిగా జి.చక్రపాణి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం గుంటూరు ఫ్యామిలీ కోర్టులో జడ్జిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్కు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండిస్తూ DRT (డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్) వద్ద లాయర్లు బుధవారం నిరసన తెలిపారు. ఓ కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించిన విషయం తెలిసిందే.
కింది కోర్టులు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విఽధించేటప్పుడు పైకోర్టులు యాంత్రికంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా స్టే ఇవ్వకూడదని తెలిపింది.
కొత్త క్రిమినల్ చట్టాలు ప్రజల జీవితాలకు ప్రమాదకరమైనవని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన క్రిమినల్ చట్టాల మీద జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన హాల్లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బెయిల్ మంజూరులో మార్గదర్శకాలు, పోలీసు అధికారులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లుగా పరిగణించడం, జ్యుడీషియరీ అధికారాలు ...
లా డిగ్రీ సిలబ్సలో మనుస్మృతిని ప్రవేశపెట్టటానికి రంగం సిద్ధం చేసిన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కు తగ్గింది.
తెలంగాణలో లా కోర్సులకు సకాలంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయవాది భాస్కర్ రెడ్డి దాఖలు చేశారు.
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవటాన్ని సెక్షన్ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.
దేశ నేర న్యాయవ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని విద్యుత్ కమిషన్ తీవ్ర వివక్ష చూపుతోందని మాజీ సీఎం కేసీఆర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.