AP High Court : మధ్యవర్తిత్వంపై హైకోర్టులో ముగిసిన శిక్షణ
ABN , Publish Date - Dec 21 , 2024 | 06:09 AM
మధ్యవర్తిత్వ విధానంలో వివాదాల పరిష్కారంపై హైకోర్టులో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది.
అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వ విధానంలో వివాదాల పరిష్కారంపై హైకోర్టులో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. సుప్రీంకోర్టు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ కమిటీ(ఎంసీపీసీ) మార్గదర్శకంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఈ నెల 16 నుంచి 20 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత, ఎగ్జిక్యూటివ్, 22 మంది హైకోర్టు న్యాయవాదులు శిక్షణకు హాజరయ్యారు. ఎంసీపీసీ కమిటీ సభ్యులు అనూజా సక్సేనా, సురేందర్ సింగ్ ఈ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందినవారు పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారానికి తోడ్పడతారని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత తెలిపారు.