Home » Liquor rates
ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. రెండు షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని మూడు షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బెవరేజె్‌సలకు అనుమతివ్వాలి. కానీ, ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది.
హైదరాబాద్, మే 27: ఇన్ని రోజులు ఏపీలో(Andhra Pradesh) మాత్రమే కొత్త కొత్త పేర్లతో బీర్లను చూశారు.. ఇప్పుడు తెలంగాణలోనూ(Telangana) కొత్త బీర్లు కిక్కు ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే కొత్త కొత్త పేర్లతో బీర్లు మార్కెట్లోకి రానున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ ..
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మళ్లీ పాత పద్ధతిలో నగదు లావాదేవీలే జరుపుతున్నారు. పోలింగ్‌కు వారం రోజుల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను (ఫోన పే, గుగూల్ పే) మాత్రమే అనుమతించారు. ఆయా రోజుల్లో ఎక్కడా నగదు తీసుకోలేదు. ఈనెల 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను బంద్ చేశారు. జిల్లాలో 127 ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వీటిలో 90 శాతం దుకాణాల్లో ప్రస్తుతం నగదు లావాదేవీలు
ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మద్య నిషేదం గురించి నవ సందేహాల పేరుతో మరో లేఖ రాశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు కాలేదని.. వివిధ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అసలే సమ్మర్.. ఆపై ఎన్నికల సీజన్.. కాస్త చిల్ అవుదామని.. చల్ల చల్లటి బీర్ కొడదామని మందు బాబులు వైన్ షాప్‌కి వెళ్లి బీర్ అడిగితే.. బీర్ గీర్ జాన్తా నై అంటూ వెళ్లగొడుతున్నారు. బ్లాక్‌లో అయినా పర్వాలేదు ఇవ్వన్నా అంటే.. అసలు బీర్లే లేవు సామీ అంటూ సమాధానం ఇస్తున్నారు.
Liquor Sales: సంపూర్ణ మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి.. మద్యం విక్రయాల్లో అరుదైన రికార్డు సొంత చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాధించని రికార్డులు నెలకొల్పారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వంలోనూ విక్రయించని స్థాయి లో భారీగా మద్యం విక్రయించారు. ఐదేళ్ల పాలనలో అక్షరాలా..
తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన టానిక్ లిక్కర్ కేసుకు (Tonique Liquor Scam) సంబంధించి తాజాగా తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు (Venkateswara Rao) కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. 2016లో టానిక్ సంస్థ కోసం ఒక చీకటి జీవో తీసుకొచ్చారని.. వైన్ డీలర్స్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పైలెట్ ప్రాజెక్టు కింద టానిక్ సంస్థకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు.
అన్ని చోట్ల డిజిటల్ పేమెంట్స్‌తో లావాదేవీలు జరుగుతాయని, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో మాత్రం జరగవని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాపుల్లో ఉన్న నగదు ఎటు వెళుతుందని అడిగారు. ఆ నగదుకు సంబంధించి లెక్కా పత్రాలు ఉన్నాయా అని అడిగారు.
భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇంట్రస్టింగ్ సీన్ నడిచింది. ఓ కేసులో విచారణ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహత్గీ రెండు మద్యం బాటిళ్లను తీసుకువచ్చి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు పెట్టారు. ఆ బాటిళ్లను చూసి సీజేగా గట్టిగా నవ్వేశారు. ఈ బాటిళ్లను మీరే తెచ్చారా? అంటూ న్యాయవాదిని అడిగారు. దానికి అవునని బదులిచ్చిన న్యాయవాది.. కేసులో సారూప్యతను వివరించడం కోసం వీటిని తీసుకురావడం జరిగిందని వివరించారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోకి మద్యం రవాణా చేయడానికి కేటుగాళ్లు కొత్త దారులను తొక్కుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఎలాగైనా సరే మద్యం చేరవేయడమే లక్ష్యంగా పని చేస్తున్న పలువురు అందుకోసం కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారు.