Home » Lok Sabha Election 2024 Live Updates
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Polls 2024), పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా. ఈవీఎంల(EVMs) భద్రత ఎలా ఉంటుంది, రీకౌంటింగ్‌కు పట్టుబడితే పరిస్థితి ఏంటి తదితర వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ - జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Rajanarsimha) కుమార్తె త్రిషతో కలిసి 196వ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్(BRS) నేతలు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. లోక్ సభ స్థానాలకుగానూ ఉదయం 11 గంటల వరకు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 32.78 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్రంలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. తాజాగా ఎన్నికల అధికారులు ఉదయం 11 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్‌ని పరిశీలిద్దాం.
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తెలంగాణలో 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పలు జిల్లాల్లో పోలింగ్ పర్సంటేజీని పరిశీలిద్దాం.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఒక్కోరకమైన పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రధాన ఎన్నికల కమిషన్ వికాస్ రాజ్ వెల్లడించారు. తొలి రెండు గంటల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.